గొంతు నులిమి చంపేశారు...
చిత్తూరు: చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలంలో ఓ మహిళను గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. మండలంలోని ఉమా శంకర్ కాలనీకి చెందిన చిన లక్ష్మమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేశారు. దుండగులు ఆమె చెవులకున్న కమ్మలు ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.