OTT: ఫాంటసీ యానిమేటెడ్ కిడ్స్ మూవీ ‘దట్ క్రిస్మస్ ’ రివ్యూ
క్రిస్మస్ పండుగ సినిమాలకు చాలా మంచి సీజన్. స్టార్ హీరోల నుండి స్మాల్ సినిమాల వరకూ ప్రపంచం మొత్తం సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి కొత్త సినిమాలు రెడీ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా కిడ్స్ కోసం ఈ సీజన్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇంక యానిమేటడ్ సినిమాల గురించి అయితే చెప్పనే అక్కరలేదు, బోల్డన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో క్రిస్మస్ సీజన్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా ఇటీవల దట్ క్రిస్మస్ అనే ఫాంటసీ యానిమేటెడ్ కిడ్స్ మూవీ రిలీజ్ అయింది. ప్రముఖ రచయిత రిచర్డ్ కర్టిస్ రాసిన దట్ క్రిస్మస్ అండ్ అదర్ స్టోరీస్ సైమన్ ఓటో ఆధారంగా ఈ సినిమా తీశారు. 2024 అక్టోబరు నెలలో జరిగిన లండన్ ఫెస్టివల్ లో ఈ సినిమాని స్పెషల్ గా స్క్రీన్ చేశారు. అంత చక్కటి కథ తో ఈ సినిమాని తీశారు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే...క్రిస్మస్ పండుగ అంటే లవ్ అండ్ అఫెక్షన్ తో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే పండుగ. ఈ పండుగకు హీరో శాంతా తాత. పిల్లలందరూ ఈ శాంతా తాత ఇచ్చే గిఫ్ట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి శాంతా తాత ఓ మిస్టేక్ వల్ల ఇవ్వాల్సిన గిఫ్ట్ టైంకి ఇవ్వలేకపోతే ఏమవుతుంది అన్నదే ఈ సినిమా. వెల్లింగ్టన్ లో వున్న టౌన్స్ ఫాక్ నగరానికి ఈసారి క్రిస్మస్ పండుగ తనతో పాటు పెద్ద మంచు తుఫానును తీసుకువస్తుంది. తుఫానులో శాంతాతాత గిప్ట్స్ తో బయలుదేరగా దారిలో తుఫానులో చిక్కుకుంటాడు. మరి శాంతాతాత ఆ తుఫాను నుండి తప్పించుకుని టౌన్స్ ఫాక్ నగరంలోని కిడ్స్ కు గిఫ్ట్స్ ఇస్తాడా లేదా అన్నది దట్ క్రిస్మస్ సినిమాలోనే చూడాలి. సినిమా అంతా చాలా సూపర్ గా ఉంటుంది. కిడ్స్ గ్రాబ్ యువర్ స్నాక్స్ అండ్ ట్యూన్ టు నెట్ ఫ్లిక్స్ టు వాచ్ దట్ క్రిస్మస్.– ఇంటూరు హరికృష్ణ