సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
మేళ్లచెర్వు(నల్లగొండ): నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలోని మైహోమ్ సిమెంట్ కర్మాగారానికి చెందిన 60 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టర్బయిన్ పేలిపోవడంతో మంటలు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
ఫ్యాక్టరీకి చెందిన అగ్నిమాపక నియంత్రణ విభాగం సిబ్బంది సత్వరమే స్పందించి అరగంటలో మంటలను ఆర్పివేశారు. మధ్యాహ్నం భోజనం కోసం కార్మికులు బయటకు వచ్చిన సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు కోటి రూపాయలకు పైగా ఆస్తినష్టం జరిగినట్టు ప్లాంట్ అధికారులు తెలిపారు.