clash between two sections
-
టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ
కృష్ణా : ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. తేలప్రోలు గ్రామ సర్పంచ్ భర్త రామకృష్ణ తన కారులో వస్తూ ముందు వెళ్తున్న వైఎస్సార్సీపీ గ్రామ నాయకుడి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. విషయం తెలుసుకున్నటీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతపై దాడికి దిగారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయం తెలిసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ, టీడీపీ నాయకులు , కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమపై దౌర్జన్యం చేశారంటూ వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో వున్న వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తేలప్రోలులో 144 సెక్షన్‌ను విధించారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్యలను గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నాయిపాలెంలో ఇరువర్గాల ఘర్షణ..
పిడుగురాళ్ల (గుంటూరు): గేదెలు విషయంపై రాజుకున్న వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణ దారితీసింది. దీంతో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గం ఇళ్లపై కత్తులతో, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం చెన్నాయిపాలెంలో మంగళవారం రాత్రి జరిగింది. చెన్నాయిపాలెం వైఎస్ఆర్సీపీకి చెందిన వారి గేదెలు ఇంటి తోలుకొస్తుండగా టీడీపీ వర్గీయులు కొందరు అడ్డగించారు. ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణగా మారింది. దీంతో టీడీపీకి చెందిన గండిగోట మురళీ, అనంత, హరికృష్ణ, రాఘవ, బాలకృష్ణ, మురళీ భార్య తదితరులు ఆవుల వెంకటకోటయ్య, శివయ్యల ఇంటిపై కత్తులు కొడవళ్లతో దాడిచేశారు. ఈ సంఘటనలో వెంకటకోటయ్య, శివయ్య తీవ్రగంగా గాయపడ్డారు. బాధితులు పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.