ఆస్థా డబుల్ ధమాకా
ఆలిండియా క్లబ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అంతర్ క్లబ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఎస్‌జీటీఐడీఎం క్లబ్ స్విమ్మర్ ఆస్థా చౌదరీ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అక్వాటిక్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో బాలికల 200 మీ. ఫ్రీస్టయిల్, 100 మీ. బటర్‌ఫ్లయ్ విభాగాల్లో స్వర్ణాలతో మెరిసింది. శుక్రవారం జరిగిన బాలికల 200 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆస్థా తొలిస్థానంలో నిలవగా... అంతర కొతారే (గ్లెన్‌మార్క్ అక్వాటిక్ ఫౌండేషన్), మెహ్రూష్ (వీ4 అక్వాటిక్ సెంటర్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బాలుర 200 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో డాల్ఫిన్ అక్వాటిక్స్ క్లబ్ స్విమ్మర్లు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు.
ఈ ఈవెంట్లో షోన్ గంగూలీ, తన్మయ్ షిండేలు వరుసగా పసిడి, రజత పతకాలను సొంతం చేసుకోగా... హిరేన్ (ఎంజీఎంసీ) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పతకాలను అందజేశారు.
ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు
50మీ. బ్యాక్‌స్ట్రోక్ బాలురు: 1. విదిత్ శంకర్ (డాల్ఫిన్ అక్వాటిక్స్), 2. సంజీవన్ కుమార్ (మార్లిన్ అక్వాటిక్స్), రిషబ్ (గ్లెన్‌మార్క్). బాలికలు: 1. అనన్య (గ్లెన్‌మార్క్), 2. కైరా (గ్లెన్‌మార్క్), 3. రాజోశ్రీ రౌత్ (కాలేజ్ స్క్వేర్ స్విమ్మింగ్ క్లబ్).
100మీ. బటర్‌ఫ్లయ్ బాలురు: 1. బిక్రమ్ (ఎస్‌జీటీఐడీఎం), 2. షోన్ గంగూలీ (డాల్ఫిన్), 3. సమర్థ్ సుబ్రమణ్యం (డాల్ఫిన్).
బాలికలు: 1. ఆస్థా, 2. పలక్ (గ్లెన్‌మార్క్), 3. సుకన్య శర్మ (డాల్ఫిన్).
బాలుర 4– 50మీ. ఫ్రీస్టయిల్: 1. గ్లెన్‌మార్క్ అక్వాటిక్ ఫౌండేషన్, 2. డాల్ఫిన్ అక్వాటిక్స్, 3. చాంపియన్ ఆక్వాటిక్ క్లబ్.
బాలికలు: 1. డాల్ఫిన్ అక్వాటిక్స్, 2. గ్లెన్‌మార్క్, 3. బసవనగూడి అక్వాటిక్ సెంటర్.
బాలుర 4–50 బటర్‌ఫ్లయ్: 1. డాల్ఫిన్ అక్వాటిక్స్, 2. స్పోర్టిఫ్ ఎంగేజెస్, 3. జియాన్ స్పోర్ట్స్
బాలికలు: 1. గ్లెన్‌మార్క్, 2. యంగ్ చాలెంజర్స్, 3. డాల్ఫిన్ అక్వాటిక్స్.