విద్యుత్ బకాయిలు రూ.350కోట్లు
విజయనగరం విద్యుత్ విభాగం, న్యూస్‌లైన్ :
ఏపీఈపీడీసీఎల్ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాలో రూ.350 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయినట్లు సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు చెప్పారు. మొత్తం బకాయిల్లో రూ.250 కోట్ల వరకు ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందినవి కాగా.. మిగిలిన రూ.100 కోట్లు సాధారణ విద్యుత్ కనెక్షన్ల నుంచి వసూలు కావలసి ఉందన్నారు. విజయనగరం జిల్లాలోనే రూ.14 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. వినియోగదారులకు సత్వర సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయూలన్నారు. బిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి సంస్థ ఆర్థికాభివృద్ధికి తోత్పడాలని సూచించారు.
దాసన్నపేట విద్యుత్ భవనంలో విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో బిల్లుల వసూళ్లు, అభివృద్ధి పనులు, విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ల నిర్వహణ పనులు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే అభివృద్ధి సాధించడం కష్టమంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో నూతనంగా ఎనిమిది సబ్స్టేషన్లు నిర్మించేందు కు రూ.15 కోట్లు నిధులు మంజూరయ్యూయని చెప్పా రు.
విజయనగరం డివిజన్ పరిధిలో ని నెల్లిమర్ల మండలం కొండవెలగాడ, గరివిడి మండలం కోనూరు, చీపురుపల్లి మండలం కె.పాలవలస, విజయనగరం పట్టణంలోని మయూరి జంక్షన్, పద్మావతి నగర్ ప్రాంతాల్లో ఈ సబ్స్టేషన్లు నిర్మించనున్నట్టు తెలిపారు. బొబ్బిలి డివిజన్ పరిధిలోని తాళ్లబురిడి, నెమలాం, గరుడిబిల్లిలో మరో మూడు సబ్‌స్టేష న్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. వీటి నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కోటి రూపాయలతో విజయనగరం-డెంకాడ ఇంటర్ లింకింగ్ లైన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1982 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు లక్ష్యం కాగా ఇప్ప టి వరకు 911 కనెక్షన్లు మంజూరు చేసినట్టు చెప్పారు. మరో 500 కనెక్షన్ల కోసం పనులు జరుగుతున్నాయన్నారు.హెచ్వీడీ పథకం కింద రూ.38.65 కోట్ల నిధులతో మూడు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను ఏడు వేల కనెక్షన్లను మార్చడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్స్ డెరైక్టర్ వజ్జి కృష్ణ, చీఫ్ జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ దత్తి సత్యనారాయణ, విజయనగరం డీఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి,బొబ్బిలి డీఈ లక్ష్మణరావు పాల్గొన్నారు.