కోచ్ బాధ్యతలకు సిద్ధంగా లేను: హస్సీ
సిడ్నీ: భారత జట్టు కోచ్‌గా తన పేరును ఎంఎస్ ధోని ప్రతిపాదించాడనే కథనాలపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘నిజానికి ఆ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానో లేదో తెలీదు. అదే నిజమైతే ఎంఎస్‌కు కృతజ్ఞతలు. కానీ నేనింకా క్రికెట్ ఆడుతున్నాను’ అని ప్రస్తుతం బిగ్‌బాష్ టోర్నీ బరిలో ఉన్న హస్సీ స్పష్టం చే శాడు. ప్రస్తుత భారత కోచ్ డంకెన్ ఫ్లెచర్ పదవీకాలం ఈ ప్రపంచకప్ అనంతరం ముగుస్తుంది. ఆయన తర్వాత హస్సీని కోచ్‌గా చేయాలని బీసీసీఐకి ధోని సూచించినట్టు వార్తలు వెలువడ్డాయి.