కాలేజీల సమ్మె
ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను తగ్గిస్తూ ఉచిత విద్య అని ఇంటర్ మీడియెట్ మీద కపట ప్రేమ వెళ్లబోస్తుంది. ఈ ఫీజులు నిర్ణయించటానికి ప్రతి కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలు, గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. ఈ బాడీలో ఆ విద్యా సంస్థకు చెందిన ప్రిన్సిపల్, కళాశాలలో చదువు తున్న విద్యార్థి, తల్లి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరిని తీసుకోవాలి. కానీ ఇలా ఏ కాలేజీ చేయ డం లేదు.
యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుల్లో సుమారు 40 శాతం ఆ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లకు, అటెండర్, నాన్ టీచింగ్ వర్కర్లకు ఇవ్వాలి. కానీ ఇలా ఏ కాలేజీ చేయటం లేదు. లెక్చరర్ పోస్టులను భర్తీ, ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుదాం.
(నేడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కళాశాలల్లో విద్యాసంఘాల సమ్మె సందర్భంగా...)
తోట రాజేశ్ ప్రగతిశీల యువజన సంఘం నాయకులు (పీవైఎల్) మొబైల్: 9440195160