ఆప్షన్లు ఇవ్వని 80 మంది రాష్ట్రేతర ఐపీఎస్లు
హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు చెందిన 80 మంది ఐపీఎస్ అధికారులు ప్రత్యూష్ సిన్హా కమిటీకి ఆప్షన్లు ఇవ్వలేదు. ఈ అధికారులు తటస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 258 ఐపీఎస్ అధికారుల పోస్టింగులు ఉండగా, ఇందులో 213 మంది మాత్రమే ప్రస్తుతం పని చేస్తున్నారు. ఇందులో 30 శాతం రాష్ట్ర పోలీసు శాఖ నుం చి ఐపీఎస్లుగా కన్ఫర్డ్ అయిన అధికారులు ఉండగా, మిగతా వారిలో మరో నలభై శాతం వరకు రాష్ట్రేతర ఐపీఎస్ అధికారులు ఏపీ కేడర్లో ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు 13ః10 నిష్పత్తి క్రింద ఐపీఎస్ అధికారులను కూడా విభజిస్తున్నారు.
దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏయే అధికారి ఏ రాష్ట్రానికి వెళ్లాలని భావిస్తున్నా రో తెలిపేలా ఆప్షన్లను ఈనెల 16న స్వీకరించింది. ఇం దులో ఇద్దరు అధికారులు సాక్షితో మాట్లాడుతూ తాము కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులమని, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో తమ సర్వీసులు ఉపయోగించదలుచుకున్నా అది తమకు సమ్మతమేనని అన్నారు.