condom brand ads
-
రూపాయి పతనం: కండోమ్ యాడ్ వైరల్
కాదేది కవితకు అనర్హం అని అన్నాడు మహాకవి శ్రీశ్రీ...... దానికి దీటుగా కాదేది ప్రకటనకు అనర్హం అంటోంది ‘డ్యూరెక్స్ ఇండియా’ కండోమ్ కంపెనీ. అవును గత కొద్ది రోజులుగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతోన్న విషయం తెలిసిందే. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో డాలర్ విలువతో పోల్చితే ప్రస్తుతం రూ.68.45గా ఉంది. కొద్ది రోజుల కిందట దీని విలువ 68.79 నుంచి 69.10కి కూడా పడిపోయింది. అయితే, రూపాయి అత్యంత కనిష్టంగా రూ.69.10కి పడిపోవడాన్ని కూడా ‘డ్యూరెక్స్ ఇండియా’ కండోమ్ సంస్థ అందిపుచ్చుకుంది. రూపాయి విలువ పతనాన్ని ఉపయోగించుకుని సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. రూపాయి విలువ 69కి పడిపోవడంలో డ్యూరెక్స్ కంపెనీకి ఓ కొత్త కోణం కనిపించింది. వెంటనే ఓ పక్రటనను రూపొందించింది. సెక్స్ పొజిషన్లలో ఎక్కువగా చెప్పుకునే ‘69’ భంగిమను ఉద్దేశిస్తూ.. ఈ ప్రకటన రూపొందించింది. ‘‘ ఈ భంగిమలో రూపాయి సరిగా పని చేయకపోవచ్చు. కానీ, మీరు చేయగలరు’’ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. Rupee may not perform in this position but you can! 😉 #RupeeAllTimeLow Buy Now: https://t.co/POmnRjSwWM pic.twitter.com/irpOXlRb1W — Durex India (@DurexIndia) June 28, 2018 -
సన్నీ లియోన్ యాడ్‌ను చూడలేకపోతున్నాం
ముంబై: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఓ కండోమ్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ చేసిన యాడ్‌పై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా విభాగం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను ఉద్దేశిస్తూ అనైతికంగా ఈ యాడ్ చిత్రీకరించారని, టీవీల్లో ఇలాంటివి చూడటం మహిళా ప్రేక్షకులకు ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాడ్ చాలా అసభ్యకరంగా తీశారని, తప్పుడు సందేశం తీసుకెళ్లేలా ఉందని, దీన్ని వెంటనే నిషేధించాలని ఆర్పీఐ (ఏ) మహిళా విభాగం కార్యదర్శి షీలా గంగుర్డె డిమాండ్ చేశారు. పలు టీవీ చానళ్లలో ఈ యాడ్ ప్రసారమవుతోందని, ఇంట్లో తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె అందరూ కలసి కూర్చుని ఇలాంటి దృశ్యాలు చూడటం ఇబ్బందికరంగా ఉంటుందని షీలా అన్నారు. దీనిపై చాలా మంది మహిళా ప్రేక్షకులు, మహిళా కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎలాంటి విలువలు పాటించకుండా అనైతికంగా, అసభ్యకరరీతిలో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా ఈ యాడ్ చిత్రీకరించారని షీలా విమర్శించారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సారథ్యంలోని ఆర్పీఐ (ఏ).. సన్నీలియోన్ యాడ్‌ను వారం రోజుల్లోగా నిషేధించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.