the conflict
-
నిండు జీవితం.. విషాదాంతం
తాగుడుకు బానిసై తరచూ గొడవలు టీవీ చానల్ మార్చే విషయంలో ఘర్షణ కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు ముదిగుబ్బ మండలం ఏబీపల్లె తండాకు చెందిన డి.లక్ష్మానాయక్(27) కుటుంబ సభ్యుల దాడిలో బుధవారం రాత్రి తీవ్రంగా గాయపడి, చివరకు ప్రాణాలు కోల్పోయాడని ఏఎస్ఐ విజయభాస్కర్‌రాజు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం... తండాకు చెందిన లక్ష్మీబాయి, వెంకటేశ్ నాయక్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు సంతానం. కుమార్తెతో పాటు పెద్ద కుమారుడు గోపాల్‌నాయక్‌కు వివాహాలయ్యాయి. లక్ష్మానాయక్, రామునాయక్ కవల పిల్లలు. వారిద్దరూ అవివాహితులు. వారిలో లక్ష్మానాయక్ తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజూ మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా అతను పీకల దాకా మందు తాగి ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులందరూ టీవీ చూస్తుండగా.. అమ్మానాన్న, తమ్ముడు అందరూ కలసి బుధవారం రాత్రి ఎంతో ఆసక్తిగా టీవీ చూస్తున్నారు. అంతలోనే మద్యం మత్తులో ఊగుతూ ఇంటికొచ్చాడు లక్ష్మానాయక్. అప్పటి వరకు చూస్తున్న చానల్‌ను మార్చాలని పట్టుబట్టాడు. కాసేపు ఆగమని చెప్పినా అతను విన్పించుకోలేదు. కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. తల్లిదండ్రులు. సోదరులు కలసి లక్ష్మానాయక్‌ను చితకబాదారు. అంతటితో ఆగక కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి బయటపడేశారు. అదే రోజు అర్ధరాత్రి రామునాయక్ మరోసారి లక్ష్మానాయక్పై దాడి చేసి బలంగా కొట్టడంతో అతను గిలగిలాకొట్టుకుంటూ మరణించాడు. రంగంలోకి పోలీసులు.. ఘటనపై లక్ష్మానాయక్ తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పరిశీలించారు. కదిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎలాగైనా పంపాలని..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ అజీజ్, కమిషనర్ చక్రధర్బాబుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. తనకు అనుకూలమైన కమిషనర్‌ను నియమించుకునేందుకు మేయర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చక్రధర్‌బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మేయర్‌కు ఆయనకు మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. అవి కాస్త పెద్దవయ్యాయి. చివరకు మున్సిపల్‌శాఖ ద్వారానే కమిషనర్ చక్రధర్‌బాబును నెల్లూరు నుంచి పంపించేందుకు ప్రతిపాదనలు తెప్పించే ప్రయత్నాలు మేయర్ అబ్దుల్ అజీజ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ స్థానంలో గతంలో పనిచేసిన జాన్శ్యాంసన్ను తిరిగి నెల్లూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ చక్రధర్ మేయర్‌ను పట్టించుకోకుండా పాలనపై దృష్టిసారించారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. హెల్త్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయడం, విధినిర్వహణలో అలసత్వం వహించిన వారిపై కఠినంగా వ్యహరించడం లాటివి చేశారు. వారందరూ మేయర్‌కు మొరపెట్టుకున్నారు. అయితే మేయర్ సూచనలను కమిషనర్ పట్టించుకోలేదు. దీనికి తోడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియను తనకు తెలియకుండానే ఖరారు చేయడం మేయర్‌కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. కనీసం కమిషనర్‌ను తన కన్నుసన్నల్లో ఉంచుకొని అనుకున్న పనులను చేసుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మేయర్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చక్రధర్‌ను తప్పించాలనే ఉద్దేశంతో నేరుగా మున్సిపల్‌శాఖ ద్వారానే ప్రతిపాదనలు తెప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ మున్సిపల్‌శాఖ కార్యాలయానికి ప్రతిపాదనల నివేదికను చేర్చినట్టు తెలిసింది.