సమ్మె విరమించకపోతే చర్యలు: కడియం
హైదరాబాద్: కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మెను విరమించాలని, ఈ నెల 12వ తేదీ లోగా విధుల్లో చేరకపోతే జీవో 16 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను 50 శాతం పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల రెగ్యులరైజేషన్కు ఆటంకం కలిగిందని అన్నారు. కొన్ని పార్టీల మద్దతుతో సమ్మె చేయడం తగదన్నారు.