యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్
డెంటల్ కళాశాల నుంచి రూ.5 కోట్లు డిమాండ్
వలపన్ని పట్టుకున్న పోలీసులు
ఏలూరు: ‘క్రైమ్ వాచ్’ పేరిట టీవీలో కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందిన ఓ యాంకర్ నేరస్తుడిగా మారాడు. హర్షవర్దన్ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెరుుంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి.బాల నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. యండ్రపాటి హర్షవర్ధన్ స్వగ్రామం జిల్లాలోని భీమడోలు మండలం తండ్రగుంట. అతను హైదరాబాద్‌లో స్థిరపడినా జిల్లాతో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెరుుంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేయాలని పథకం వేశాడు.
నల్లజర్లకు చెందిన ఫాదర్ లూక్బాబును మధ్యవర్తిగా ఉపయోగించుకున్నాడు. అతని ద్వారా ఫాదర్ బాలకు ఫోన్‌చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే కళాశాలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తామని బెదిరించారు. బాధితుడు ఎస్పీ రఘురామిరెడ్డిని ఆశ్రయించారు. ఎస్పీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ముందుగా ఫాదర్ లూక్బాబును అదుపులోకి తీసుకున్నారు. హర్షవర్ధన్ విజయవాడలో ఉన్నట్టు పసిగట్టి శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.