భద్రతలేని బతుకులు
శ్రీరాంపూర్ : సింగరేణిలో సర్వీస్ అండ్ ప్రొటక్షన్ క్రాప్స్(ఎస్అండ్పీసీ) డిపార్టుమెంట్లో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందుల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో 1900 మంది సెక్యూరిటీ గా ర్డులు ఈ డిపార్టుమెంటులో పని చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు, సీనియర్ సెక్యూరిటీ గార్డు, జమేదారు, జూనియ ర్ ఇన్స్పెక్టర్, సీనియర్ ఇన్స్పెక్టర్ వంటి పలు డిజిగ్నేష న్లు ఇందులో ఉంటాయి.
ఇందులో కిందిస్థాయిలో పనిచే సే గార్డులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గనులపై మొయిన్ గేట్ల వద్ద, మ్యాగ్జిన్ కేంద్రాలు ఓసీపీలు, సీహెచ్స్పీ, స్టోర్స్, వర్క్‌షాప్, గ్యారేజీలతోపాటు కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో బొగ్గు లారీలను చెక్‌పోస్టుల వద్ద ఉండి కాపాడుతారు. వీరి వేతనాలు, పదోన్నతులు అ ధ్వానంగా ఉంటున్నాయి. భయం భయంతో ఏలాంటి రక్షణ లేకుండా పని చేయాల్సి వస్తుంది.
కనీసం విధులు నిర్వర్తించే చోట కనీస సౌకర్యాలు లేకున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. గనుల వద్ద కాపలాగా ఉండే వారికి డస్టు మాస్కులు ఇవ్వకపోవడంతో నిత్యం బొగ్గు లారీలు వల్లే వచ్చే విపరీతమైన దుమ్మును పీల్చుతూ డ్యూటీలు చేస్తున్నారు. వర్షాకాలం రెయిన్ కోట్లు, చలి కాలం వార్మ్ కోట్లు ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా సరఫరా చేయడం లేదు. దీంతో వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ డ్యూటీ చేస్తున్నారు.
అరచేతిలో ప్రాణాలు
కొన్ని రిస్క్ ప్రాంతాల్లో డ్యూటీలు చేయాలంటే గార్డులు భయపడుతున్నారు. కనీసం లాఠీలు కూడా ఇవ్వకుండా విధులకు పంపిస్తున్నారు. స్వీయ రక్షణ కోసం చేతిల్లో లాఠీలు ఉండాలి. ఒకటో రెండో ఉంటే అవి మ్యూజి యంలో వస్తువులుగా కార్యాలయాల్లో మాత్రమే ఉంటా యి. కాపర్ తీగల కోసం దొంగతనాలు ఎక్కువగా జరిగే ఓసీపీలు, ప్రహారీ గోడలు సరిగ్గా లేని గనుల వద్ద డ్యూ టీ చేసే గార్డులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్యూ టీలు చేస్తున్నారు. స్క్రాప్ దొంగలు ఒక్క సారిగా వారిపై రాళ్లవర్షం కురిపిస్తూ దాడి చేసి గనుల్లోకి దూరుతారు. వారికి అడ్డంగా వెళ్లారంటే ప్రాణాలు పోవాల్సిందే.
దొంగల రాళ్ల దాడులు, బంధించి కొట్టిన సందర్భాల్లో చాలా మంది గార్డులు గాయాల పాలైన సంఘటనలు కోకొల్లాలు. శ్రీరాంపూర్ ఓసీపీ, ఎస్సార్పీ 3, ఆర్కే 6 గనులపై గతంలో జరిగిన పలు ఘటనలే ఇందులకు ఉదాహరణ. కనీసం స్టోన్ గార్డులు కూడా ఇవ్వకుంటే ఎలా దొంగలను ప్రతిఘటిస్తామని ప్రశ్నిస్తున్నారు. హెల్మెట్లు కూడా ఇవ్వడం లేదు. రాత్రి వేళ ఎదురుగా వచ్చేది దొం గో, దొరో తెలుసువడానికి టార్చీ లైట్లు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. పాముల, తేళ్ల నుంచి రక్షణ కోసం కొందరు సొంత డబ్బులు పెట్టి కొనుక్కొంటున్నామని పేర్కొంటున్నారు. షూష్ కూడా క్రమం తప్పకుం డా ఇవ్వడం లేదు.
ఓసీపీల వద్ద తడకల షెడ్లే వీరు డ్యూ టీ చేసే చెక్ పోస్టులుగా ఉంటున్నాయి. రోడ్లపై ఉంటే లారీల చెక్‌పోస్టుల వద్ద లారీలను ఆపడం కోసం గేట్లు పెట్టడానికి ప్రభుత్వ నిబంధలను ఒప్పుకోవు. కనీసం టార్చి లైటు చూపి ఆపాలన్న అవి కూడా ఇవ్వడం లేదు. దొంగ బొగ్గు లారీలు ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిన చేయగలిగింది ఏమి లేదు. తప్పించుకొని పోయిన లారీ ఎక్కడై న పట్టుబడితే అక్కడి నుంచి ఎలా వెళ్లనిచ్చారని ముం దున్న చెక్‌పోస్టు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉంటే చెక్‌పోస్టులకు వెళ్లాలంటే వారే సొంత వాహనాల్లో వెళ్లాలి. కంపెనీ ఎలాంటి వాహనం సమకూర్చడం లేదు.
జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని డ్యూటీలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నా రు. ఇక చెక్ పోస్టుల దుస్థితి చూస్తే మరి అధ్వానంగా ఉంది. కనీసం వారికి కూర్చోవడానికి కుర్చీలు, గాలికి ప్యాన్లు ఉండవు. ఏన్నో ఏళ్ల కిత్రం కట్టిన చెక్‌పోస్టులు కావడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారు. తలుపులు కిటికీలు ఊడిపోయాయి. రాసుకోవడానికి ప్యాడ్ కూడా ఇవ్వరు. వర్షం వస్తే సైకిల్ షెడ్లలోకి దూరం డ్యూటీలు చే యాల్సి వస్తుందని సెక్యూరిటీ గార్డులు వాపోతున్నారు.
కోలిండియా పదోన్నతుల పాలసీ అమలు చేయాలి..
సింగరేణిలో కోలిండియాలో ఉన్న మాదిరిగా ప్రమోషన్ల పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీలు ఉంటే టెస్టు పెట్టి ప్రమోషన్లు ఇస్తున్నారు. అది కూడా సీనియారిటీని, టెస్టులో వచ్చిన మార్కుల ప్రాతిపధికగా చేసుకుంటున్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా కొన్ని సంవత్సరాల నిర్ధిష్ట కాలపరిమితి సర్వీసు చేయగానే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కోలిండియాలో సెక్యూరిటీ గార్డుగా చేరితే అతనికి ఈ గ్రేడ్ ఇస్తున్నారు. అదే సింగరేణిలో మాత్రం జీ గ్రేడ్ ఇస్తున్నారు. ఇక్కడ జీ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్‌కు పోవాలంటే 14 ఏళ్ల సర్వీసు చేయాలి. దీంతో ఎదుగుబొదుగు లేకుండా పోతోంది. గార్డు నుంచి సీనియర్ గార్డు అయిన వారికి రెండు పట్టీలు ఇస్తున్నారు తప్ప రూపా యి జీతం పెంచడం లేదని వాపోతున్నారు.
ప్రమోషన్ పాలసీ మార్చాలని తీవ్ర విమర్శలు రావడంతో యాజ మాన్యం దీనిపై కొన్ని నెలల క్రితం కమిటీ వేసి కోలిండియాలో అమలవుతున్న ప్రమోషన్ పాలసీని పరిశీలించాల్సిందిగా పంపించింది. వెళ్లి వచ్చిన కమిటీ రిపోర్టు ఇచ్చిన కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్ని అవస్థలు పడుతున్న అటు యాజమాన్యం పట్టించుకోకుండా ఇటు తాము గెలిపించిన గుర్తింపు సంఘం టీ బీజీకేఎస్ కూడా పట్టించుకోకపోవడంతో తాము ఎవరికి చెప్పుకొనేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైన యాజమాన్యం స్పందించి వారి సమస్యలు పరిస్కరించాల్సి అసవరం ఉంది.