తగ్గిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడికి అతి స్వల్ప ఊరట. పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. ఒక లీటరు పెట్రోలుపై 50 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు శనివారం ప్రకటించాయి. కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలవుతాయి. కాగా, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రెండు వారాల కిందటే డీజిల్ ధరను రెండు రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే.