బజరంగ్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: డేవ్ షుల్జ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ బజరంగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 12-3 పాయింట్ల తేడాతో వ్లాదిమిర్ ఫ్లెగోన్తోవ్ (రష్యా)పై గెలిచాడు.
భారత్‌కే చెందిన రాహుల్ అవారె (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) పతకాలు నెగ్గడంలో విఫలమయ్యారు. స్టార్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్ ఈ టోర్నీలో బరిలోకి దిగలేదు.