తెలంగాణ వేడుకలు వారం రోజులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అధికారులకు సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అవతరణ ఉత్సవాలను అధికారి కంగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. జూన్2న ఉదయం 8.45 గంటలకు నిజామాబా ద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
వారం రోజుల పా టు జరిగే ఉత్సవాల్లో జిల్లా చరిత్ర, చారిత్రక కట్టడాలు, సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులచే నాటికలు, ఒగ్గుకథ, బుర్రకథ, చిందు యక్షగానం, బోనాలు, బతుకమ్మ, సామాజిక జానపద గేయాలు, కోలాటం, ఒగ్గుడోలుపై ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ ప్రాచీన వైభవంపై డాక్యుమెం టరీ ప్రదర్శిస్తారు. సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడు తూ జిల్లాలోని ప్రజల జీవన విధానం, స్థితిగతులపై ప్రదర్శనలు వారోత్సవాలలో చోటు చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి, డ్వామా పీడీ శివలింగయ్య, ఐకేపీ పీడీ వెంకటే శం,డీఈఓ శ్రీనివాసచారి, సీఈఓ రాజారాం తదితరులు పాల్గొన్నారు.