డిసెంబర్ 3 నుంచి సివిల్స్ మెయిన్స్
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ -2016 పరీక్షలను డిసెంబర్ 3 నుంచి 9 వరకు ఎంపిక చేసిన 23 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తెలిపింది. అభ్యర్థులు తమ ఈ-అడ్మిట్ కార్డులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఈ కార్డుల్లో ఫోటో సరిగాలేని అభ్యర్థులు తమ కొత్త ఫోటో, గుర్తింపు కార్డులైన ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్, పాస్పోర్ట్లలో ఏదైనా ఒకటి పరీక్ష కేంద్రాల్లో చూపించాలని కోరింది. ఈ-అడ్మిట్ కార్డులు పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే 011-23381125, 011-23098543, 011-23385271 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది.