రూ.360 కోట్లతో అభివృద్ధి పథకాలు
జిల్లా సబ్ప్లా¯ŒS మానటరింగ్ కమిటీ సభ్యుడు స్టాలి¯ŒSబాబు
భానుగుడి (కాకినాడ):
జిల్లాలో పశు సంవర్థక శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ఫ్) సంయుక్త ఆ««దl్వర్యంలో రూ.360 కోట్లతో పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నట్టు జిల్లా సబ్ప్లా¯ŒS మానటరింగ్ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలి¯ŒSబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్సిడీ కింద చూడి పెయ్యల పెంపకం, పొట్టేలు పిల్లల పెంపకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని 32 మండలాల్లో 75 శాతం సబ్సిడీపై షెడ్యుల్డ్ కులాలకు చెందిన 600 మందికి చూడి పెయ్యలు, పొట్టేలు పిల్లలను అందించనున్నట్టు తెలిపారు. దీనికి రూ.360 కోట్ల నిధులు వెచ్చిస్తుండగా, రూ.2.7 కోట్లు సబ్సిడీగా అందజేస్తామన్నారు. రూ.90 లక్షలు లబ్ధిదారుని వాటాగా నిర్ణయించామన్నారు. లబ్ధిదారుని వాటాలో అధిక శాతం స్త్రీనిధి బ్యాంకుల నుంచి రుణాలుగా ఇప్పిస్తామన్నారు. ఈ పథకాల అమలు కోసం జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.