ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
ధరూరు : పొలంలో కరిగెట చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడటంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధరూరుకు చెందిన దర్శెల్లి(35) కొన్నాళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్యలు పద్మ, బీసమ్మతోపాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం పారుచర్ల స్టేజీ సమీపంలోని పొలంలో అతను కరిగెట చేస్తుండగా వాహనం బోల్తాపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ విశ్వనాథ్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, బాధిత కుటుంబాన్ని సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ భర్త గోవిందు పరామర్శించారు.