ప్రారంభమైన శోభా యాత్ర
హైదరాబాద్: శ్రీ రామ నవమి శోభా యాత్ర ధూల్ పేట్ గంగా బౌలి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్లొథ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర నగరంలోని మంగళ్ హాట్, పురానాపూల్, ఛత్రీ, బేగంబజార్, సిద్ది అంబర్ బజార్, గౌలిగూడల మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామ శాల వరకు కొనసాగనుంది.
అంతేకాకుండా ఈ ఏడాది నుంచే సీతారాంబాగ్ ఆలయం నుంచి కూడా భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి నాయకులు మరో యాత్ర ప్రారంభించారు. ఈ రెండు శోభా యాత్రలు మంగళ్ హాట్ అనిత టవర్ దగ్గర కలవనున్నాయి.