diii
-
మార్చి క్వార్టర్లో భారీగా పెరిగిన డీఐఐల పెట్టుబడులు
మార్చి త్రైమాసికంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులతో కొంతమేర భర్తీ అయ్యాయి. ఈ త్రైమాసికంలో భారత ఈక్విటీలలో డీఐఐల హోల్డింగ్ రికార్డు స్థాయిలో 14.8 శాతానికి చేరినట్లు యాక్సిస్ క్యాపిటల్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జనవరి నుంచి స్థానిక పెన్షన్ ఫండ్స్, బ్యాంకుల ట్రెజరీ నిర్వహణ ఆస్తులు వరుసగా 20 శాతం, 47 శాతం పెరిగాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే స్టాక్ మార్కెట్లోకి దేశీయ ప్రవాహాల పెరిగినట్లు తెలుస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్లో స్థానిక మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్థానిక పెన్షన్ ఫండ్స్, బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు డీఐఐగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2020 నాటికి డీఐఐ ఏయూఎం రూ.20.4లక్షల కోట్లు ఉండగా, ఎఫ్ఐఐల ఏయూఎం రూ.24.4లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి ఈక్విటీ మార్కెట్లో డీఐఐలు రూ.72వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే ఎఫ్ఐఐలు రూ.39వేల కోట్లు ఉపసంహరించుకున్నారు. బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో మొత్తం కంపెనీల ఫ్రీ- ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో డీఐఐల హోల్డింగ్ మూడో వంతుకి చేరుకుంది. ఇదే ఇండెక్స్‌లో మార్చి క్వార్టర్లో దేశీయ ఇన్వెస్టర్లు సమారు 106 కంపెనీల్లో 1శాతానికి పైగా వాటాను పెంచుకున్నారు. 42 కంపెనీల్లో 1శాతం వాటాను తగ్గించుకున్నారు. ఇక ఎఫ్ఐఐ హోల్డింగ్ విషయానికొస్తే.. ఇదే ఇండెక్స్‌లో వారి వాటా 70బేసిస్ పాయింట్లు తగ్గి 21.5శాతానికి చేరుకుంది. వారు నిఫ్టీ-50 కంపెనీల్లో 27 కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. ఇదే మార్చి క్వార్టర్లో డీఐఐలు పవర్‌గ్రిడ్ కార్పోరేషన్, ఐషర్‌మోటర్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ తదితర లార్జ్ కంపెనీలకు చెందిన సుమారు రూ.15వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. -
స్పెషల్ ప్యాకేజీ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ఈఈ, డీఈఈల సమావేశంలో పీఆర్ ఎస్ఈ చిత్తూరు(టౌన్): జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కానున్న స్పెషల్ ప్యాకేజీ పనులకు వె ంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని పంచాయతీరాజ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ హమీద్‌బాషా తెలిపారు. బుధవారం చిత్తూరులోని పీఆర్ ఎస్ఈ కార్యాలయంలో ఆయన జిల్లాలోని పీఆర్ఐ, పీఐయూ విభాగాల పరిధిలోని ఈఈలు, డీఈఈలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసే నాబార్డు, పీఎంజీఎస్‌వై, బీఆర్జీఎఫ్, 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు కూడా స్పెషల్ ప్యాకేజీ పనులను మంజూరు చేస్తామని ప్రకటించిందన్నారు. దాంతో రానున్న ఐదేళ్ల ప్రణాళికలను ఈ స్పెషల్ ప్యాకేజీ పనుల ద్వారా చేపట్టనుందని పేర్కొన్నారు. అయితే ఈ పథకం కింద ఇప్పటివరకు చేపట్టి అసంపూర్తిగా వున్న భవనాలను కూడా చేపట్టవచ్చని వివరించారు. అలాగే ఇప్పటివరకు తాగునీటి అవసరాలకే ఉపయోగిస్తున్న బీఆర్జీఎఫ్ నిధులను ఇకపై తారురోడ్ల నిర్మాణాలకు కూడా ఖర్చు పెట్టొచ్చని తెలిపారు. అయితే ఈ స్పెషల్ ప్యాకేజీ కింద కేంద్రం మంజూరు చేసే నిధులు ఖర్చయ్యేసరికి మంజూరవుతూనే వుంటాయని, దానికనుగుణంగా మనం కూడా పని చేయాలని ఆయన ఈఈలు, డీఈఈలను కోరారు. మండల కమిటీల ద్వారా మండలాల్లో వున్న చెక్‌డ్యాముల వివరాలను సేకరించాలన్నారు. సేకరించిన వివరాలను ఆన్లైన్ ద్వారా జీపీఆర్ఎస్లో పెట్టాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వున్న రోడ్ల పేర్లు, వాటి పొడవు, అవి తారురోడ్లా, సిమెంట్ రోడ్లా, మట్టిరోడ్లా అనే వివరాలను జీఐఎస్ (జియోగ్రాపికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ద్వారా సేకరించి ఆన్లైన్లో పెట్టాలన్నారు. ఇవన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆయన పేర్కొన్నారు.