ప్రైవేట్ కంపెనీలకు ఊరట
ఫాస్ట్ ట్రాక్...
కొత్త కంపెనీల చట్టానికి త్వరలో సవరణలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలపై పాలనా సంబంధ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనలను సరళతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో దాదాపు 13 సడలింపులను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది.
షేర్ క్యాపిటల్, ఓటింగ్ హక్కులు, ఆడిటర్, డెరైక్టర్ల నియామకం, పబ్లిక్ డిపాజిట్ల స్వీకరణపై నిషేధం, బోర్డు హక్కులు, డెరైక్టర్లకు రుణాలు, ఉన్నత యాజ మాన్య స్థాయి సిబ్బంది నియామకాలపై పరిమితుల నిబంధనలను సడలించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొం దించిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజలు తమ సూచనలు, వ్యాఖ్యానాలను జూలై 1లోగా పంపాలనీ, తర్వాత నోటిఫికేషన్‌ను పార్లమెంటు ఉభయ సభల ముందుంచుతామని ఆ శాఖ ఓ సర్క్యులర్‌లో తెలిపింది.