జిల్లా కేంద్రంగా కామారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ
కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కార్యాలయాలకు అవసరమైన స్థలాలను చూడాలని కూడా విప్ గోవర్ధన్‌కు సూచించారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆస్తులను స్వాధీ నం చేసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికీ అంగీకరించారు.
కామారెడ్డి: కామారెడ్డివాసుల చిరకాల కోరిక తీరబోతోంది. జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారి తో మాట్లాడుతూ జిల్లాలో మరో మూడు అ సెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని, ఆరు నియోజకవర్గా లకో జిల్లా చొప్పున రెండు జిల్లాలను చేస్తామన్నారని పేర్కొన్నారు.
కామారెడ్డిలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను అధికారులతో కలిసి చూడాలని కూడా స్థానిక ఎమ్మెల్యే గోవర్ధన్‌కు సీఎం సూచించారు.అంతకు ముం దు వారు కామారెడ్డిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరి ణామాలను సీఎంకు వివరించారు. కాలేజీ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు మేనేజ్మెంట్ కమి టీ ముందుకు వస్తున్నందున వారిని ఆహ్వాని ద్దామని సీఎం పేర్కొన్నారని జేఏసీ నేతలు తెలిపారు.
కాలేజీ ఆస్తులన్నింటినీ స్వాధీనం చే సుకుని, కేజీ నుంచి పీజీ విద్యాపథకాన్ని అమలు చేయడంలో భాగంగా అక్కడ ప్రభుత్వ వి ద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సుమారు గంటపాటు సీఎం వా రితో మాట్లాడారు. త్వరలోనే కామారెడ్డికి వ చ్చి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారన్నా రు. సీఎంను కలిసినవారిలో జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం,కొమ్ముల తిర్మల్‌రెడ్డి, డాక్టర్ వి. శంకర్, వీఎల్ నర్సింహారెడ్డి, క్యాతం సిద్ధరా ములు,వెకంట్రాంరెడ్డి, విద్యార్థి సంఘాల నేత లు బాలు, ఆజాద్, దశరథ్, రవీందర్, భాను, అరుణ్, నరేశ్, జబ్బార్ తదితరులున్నారు.