శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ విచారణకు డిమాండ్
తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం తీర్మానం
ప్రతిపక్ష నేతగా స్టాలిన్ ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏపీలోని శేషాచల అడవుల్లో తమిళ కూలీలను ఎన్కౌంటర్ చేసిన కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం తీర్మానించింది. తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా డీఎంకే కోశాధికారి, కొళత్తూరు ఎమ్మెల్యే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యవర్గ భేటీలో కరుణానిధి స్టాలిన్ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.