చాయ్ వాలా ప్రమాణస్వీకారానికి 'డాక్టర్' దాబావాలా!
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా 'చాయ్ వాలా' నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి ఓ దాబా యజమానికి ఆహ్వానం అందింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో దాబా నడుపుతున్న షాజాద్ ఇబ్రహిమీకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందింది. ఓ చాయ్ వాలా దేశ ప్రధాని కావడం తనకు ఆనందం కలిగిస్తోందని షాజాద్ అన్నారు.
జేఎన్ యూలో దాబా నడుపుతున్న షాజాద్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. జేఎన్ యూలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేశారు. ఉన్నత విద్య, అన్ని అర్హతలు ఉన్నా షాజాద్ ఓ మంచి ఉద్యోగం పొందలేకపోయారు. నిరుద్యోగంతో బాధపడుతూ.. జేఎన్ యూ క్యాంపస్ లో ఛాయ్, స్నాక్స్ అందిస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. జేఎన్ యూ క్యాంపస్ లో షాజాద్ నడిపే 'మామూస్ దాబా' తెలియని వారెవరూ ఉండరు. ఎన్ డీఏలో భాగస్వామైన ఆర్ఎస్ఎస్పీ షాజాద్ ప్రొఫైల్ వివరాలను మోడీ కార్యాలయానికి అందించడంతో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది.