డ్యూయల్ డిగ్రీకి అవకాశం
జేఎన్టీయూ: జేఎన్టీయూ(అనంతపురం), బ్లెకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(స్వీడన్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరినట్లు జేఎన్టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్ మంగళవారం తెలిపారు. ఈ ఒప్పందంతో జేఎన్టీయూలో ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ కోర్సుల్లో మూడేళ్లు, చివరి సంవత్సరం బ్లెకింగ్ వర్సిటీలో చదవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. డిగ్రీ జేఎన్టీయూ, బ్లెకింగ్ వర్సిటీ డ్యూయల్ డిగ్రీ ప్రదానం చేస్తామన్నారు.
ఎంటెక్ కోర్సు చదవడానికి బ్లెకింగ్ వర్సిటీలో చదివే వెసులుబాటు విద్యార్థులకు కలుగుతుందన్నారు. బ్లెకింగ్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అండర్స్ హెడిస్ట్రేయాన్, జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య పాండురంగడు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ఆచార్య ఆనందరావు, ఆచార్య విజయ్‌కుమార్ పాల్గొన్నారు.