డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని వాహనం బోల్తా
కడప: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్. చిన రాజప్ప ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు సమీపంలోని రాయప్పగారి పల్లె వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు ప్రాధమిక చికిత్స అందించారు. శనివారం చిన రాజప్ప వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు.