9న ఎంసెట్ ర్యాంకుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకులను ఈనెల 9న సాయంత్రం 4:30 గంటలకు వెల్లడించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు తెలిపారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఈ ర్యాంకుల వెల్లడి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మే 22న జరిగిన ఈ పరీక్ష రాసేందుకు 3,95,670 మంది దరఖాస్తు చేసుకోగా 3,73,286 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్లో 2,82,815 దరఖాస్తు చేసుకోగా 2,66,895 (94.37 శాతం) మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్లో 1,12,855 మంది దరఖాస్తు చేసుకోగా 1,06,391 (94.27 శాతం) మంది పరీక్ష రాశారు.
ఎంబీఏ, ఎంసీఏ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను జేఎన్టీయూహెచ్ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈశ్వర్ప్రసాద్ తెలిపారు.