గుర్తింపు రద్దయిన కాలేజీలకు ఊరట..
హైదరాబాద్ : తెలంగాణలో గుర్తింపు రద్దయిన ఇంజినీరింగ్ కాలేజీలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో డివిజన్ బెంచ్ కొన్ని మార్పులు చేసింది. గుర్తింపు రద్దయిన ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయంపై ఈ 30లోగా అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలని డివిజన్ పేర్కొంది. వచ్చే నెల 4న తదుపరి విచారణ చేపట్టనుంది. సరైన ప్రమాణాలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దు చేసే అధికారం జేఎన్టీయూకు ఉందని కూడా తెలిపింది.
3 రోజుల్లో అధికారులు తనిఖీలు మొదలు పెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు రద్దయిన కాలేజీలను సైతం కౌన్సెలింగ్ కు అనుమతించాలని ఆదేశించింది. కాలేజీల గుర్తింపు అనేది హైకోర్టులో పెండింగ్లో ఉందని కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులకు తెలియాజేయాలని పేర్కొంది.