పార్లమెంటులో అదే రచ్చ
బలమున్నా ఓటింగ్‌కు భయమెందుకు: తృణమూల్
- దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందా?: ఆజాద్
- విపక్షాల సూచనలు స్వీకరిస్తామన్న కేంద్రం
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మరో రోజూ ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడింది. నోట్ల రద్దుపై జరుగుతున్న రచ్చతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్‌సభలో నోట్లరద్దుపై రూల్ 184 కింద చర్చించాలన్న డిమాండ్‌తో విపక్షాలు సోమవారం నిరసన తెలిపాయి. అరుుతే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విపక్షాల సూచనలు వింటామన్నారు. ఏ రూల్ కింద చర్చ జరగాలనే విషయంపై నిర్ణయాధికారం స్పీకర్‌కే వదిలేద్దామని చెప్పారు. అరుునా విపక్షాల ఆందోళన తగ్గలేదు. దీంతో రూల్ 193 చర్చ (ఓటింగ్ ఉండదు)కు స్పీకర్ యత్నించారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే తృణమూల్ ఎంపీ ఒకరు జితేందర్ మైక్రో ఫోన్ లాక్కొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ వారుుదా పడింది. ‘మేం రూల్ 56 నుంచి రూల్ 184కు తగ్గాం. ప్రభుత్వం కూడా 193 నుంచి కాస్త తగ్గాలి’అని ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూరుుంచారుు. అనారోగ్యం నుంచి కోలుకున్న కాంగ్రెస్ చీఫ్ సోనియా సభకు రాగా, జయ అనారోగ్యం కారణంగా అన్నాడీఎంకే ఎంపీలంతా గైర్హాజరయ్యారు.
ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా?: అటు రాజ్యసభలోనూ.. నోట్ల రద్దు కారణం గా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని నిరసిస్తూ విపక్షాలు ఆందోళన చేశారుు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ ఎంపీలు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు.దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని ఆజాద్ (కాంగ్రెస్) ప్రశ్నించారు.
ఇక కొత్త ఐఐటీల్లేవ్: కొత్తగా ఏ రాష్ట్రం లోనూ ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్‌ఐటీలను స్థాపించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ తెలిపారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ అందించే పథకాలను ఎక్కువ మందికి అందించేందుకు వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచాలని ప్రతిపాదనలు అందినట్లు కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.