సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఎడ్సెట్ 2014 ‘కీ’
హైదరాబాద్: బీఈడీలో ప్రవేశానికి రాష్టవ్య్రాప్తంగా మే 30న నిర్వహించిన ఎడ్సెట్ 2014 పరీక్ష సమాధానాలను పేపర్లవారీగా సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది. నిపుణుల సహాయంతో రూపొందించిన ఈ ‘కీ’ని ప్రశ్నపత్రాలతో సహా వెబ్సైట్లో పొందుపరచడమైంది.
మ్యాథమేటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇంగ్లిష్ సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు లక్షా యాభై వేల మంది హాజరయ్యారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్ని మార్కులు వస్తాయో ఒక అంచనాకు రావచ్చు. ఎడ్సెట్ 2014 ‘కీ’ కోసం చూడండి.. http://www.sakshieducation.com/EdCET.html