నేనే డబ్బులు ఇస్తా
సాధారణంగా క్రికెటర్లంతా ఐపీఎల్ కోసం ఎగబడేది అందులో వచ్చే భారీ మొత్తం డబ్బు కోసం. అయితే దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఎడీ లెయీ మాత్రం ఐపీఎల్లో తనను ఆడిస్తే తానే ఎదురు డబ్బులు ఇస్తానంటున్నాడు. చాలాకాలం నుంచి ఐపీఎల్లో ఆడాలనేది అతడి కోరిక. ఎన్నిసార్లు వేలం కోసం తన పేరు పంపినా ఏ జట్టూ అతణ్ని తీసుకోలేదు. ఎలాగైనా ఐపీఎల్ ఆడాలనే తన కలను నిజం చేసుకోవడానికి అవసరమైతే తానే ఎదురు డబ్బులిస్తానని అంటున్నాడు ఈ స్పిన్నర్.
ప్రస్తుతం ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్లో దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు అతను భారత్కు వచ్చాడు. ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అతను ఆడాడు. మరి ఫ్రాంచైజీ అధికారుల దృష్టికి ఈ వార్త వెళ్లిందో లేదో..!