పెట్టుబడులకు సిద్ధంగా 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు
హైదరాబాద్: హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ కంపెనీలు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. స్థలం కేటాయించగానే సంస్థలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయని ఎలక్ట్రానిక్ పరిశ్రమల సంఘం (ఎలియాప్)తెలిపింది.
ఎలియాప్ పరిధిలో మొత్తం 64 కంపెనీలు ఉన్నాయి. ఇవి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నా భూముల కేటాయింపులు జరుగకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోంది. భూవిస్తీర్ణం, భూమి ధరల విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, భూకేటాయింపుల ఆధారంగా ఈ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.