Erraiah
-
సిలిండర్ పేలి వ్యక్తి మృతి
-
సిలిండర్ పేలి వ్యక్తి మృతి
తిరుపతి క్రైం: గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుపతిలోని కనకభూషణం లే అవుట్లో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఎర్రయ్య(58) ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుండటంతో.. దాన్ని ఆపేందుకు యత్నిస్తున్న క్రమంలో అది పేలడంతో.. ఎర్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య రెడ్డమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రురాలిని రుయా ఆస్పత్రికి తరలించారు.