రూ.10లక్షల వరకు షూరిటీ లేని రుణాలు
ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఫీల్డ్ జనరల్ మేనేజర్ కనేకల్ చంద్రశేఖర్
తిరుపతి సిటీ: చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద రూ.10 లక్షల వరకు షూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ కనేకల్ చంద్రశేఖర్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని జీవనోపాధి వనరుల కేంద్రంలో రూ.377.38 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. చంద్ర శేఖర్‌తో పాటు రీజనల్ హెడ్ ఏజీఎం రాంప్రసాద్ మిశ్రా, డెప్యూటీ రీజనల్ హెడ్ డి.మహేశ్వరయ్య ముఖ్య అతిథులుగా హాజరై రుణాలు పంపిణీ చేశారు.
చంద్రశేఖర్ మాట్లాడుతూ లబ్ధిదారులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే తమ బ్యాంక్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 220 శాఖలున్నాయని, త్వరలో కుప్పం, అనంతపురం, హిం దూపురం, బుచ్చిరెడ్డిపాళెం, సంత్రవేలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూని యన్ లోన్ పాయింట్ మేనేజర్ ఎస్.వాసంతి, అసిస్టెంట్ మేనేజర్ న్రూపెన్ చక్రవర్తి, బ్యాంక్ అధికారులు మాసిలామణి, ప్రశాంత్సాహు, సోమెన్, జితేంద్ర, రంజీబ్, రెడ్డెప్ప పాల్గొన్నారు.