ఐపీఎస్ అధికారినవుతా: పూర్ణ
సిరికొండ: చిన్నతనంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన మాలావత్ పూర్ణ చదువులోనూ సత్తా చాటింది. టెన్త్‌లో 7.2 పాయింట్లతో ఉత్తీర్ణురాలైంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన సందర్భంగా తనకు చేసిన సన్మాన కార్యక్రమాల వల్ల సరిగా చదవలేకపోయానని, దీంతో తక్కువ పాయింట్లు వచ్చాయని తెలిపింది.
సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సంఘం కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తితో ఐపీఎస్ కావాలని ఉందని పూర్ణ పేర్కొంది. టెన్త్ పాస్ అవ్వడం పట్ల పూర్ణ తల్లిదండ్రులు మాలావత్ దేవిదాస్, లక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు.