క్రిప్టోల్లో పెట్టుబడులకు జియోటస్ ‘బాస్కెట్స్’
హైదరాబాద్: క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు ఆప్షన్లను తమ యాప్, వెబ్సైట్లలో అందుబాటులోకి తెచ్చినట్లు జియోటస్ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీ వెల్లడించింది. బాస్కెట్స్ ఆప్షన్‌తో నిపుణులు ఎంపిక చేసిన క్రిప్టో అసెట్స్‌లో అతి తక్కువగా రూ. 100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది.
డిఫై, మెటావర్స్, గేమింగ్, మీమ్ వంటి వివిధ థీమ్స్ ఆధారిత క్రిప్టోకరెన్సీలు వీటిలో ఉంటాయని వివరించింది. అలాగే హెచ్చుతగ్గులతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మార్గంలో పెట్టుబడులు పెట్టే ఆప్షన్ కూడా ఉందని సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు.