ఎకనామిక్స్ లో 100, గుజరాతీలో 13 !
గుజరాత్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియేట్ ఫలితాల్లో ఓ విద్యార్ధికి ఆశ్చర్యకరమైన మార్కులు వచ్చాయి. మొత్తం ఏడు సబ్జెక్టుల్లో ఐదింట ఫెయిలయిన అతను.. ఎకనామిక్స్ లో 100 కు 100 మార్కులు సాధించాడు. దీంతో టీచర్లు, విద్యారంగం నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎకనామిక్స్ లో ఫుల్ మార్కులు సాధించడం చాలా అరుదని అలాంటిది గుజరాతీ భాషలో 100కు కేవలం 13 మార్కులు, సంస్కృతంలో 4, సోషియాలజీలో 20, ఫిజియాలజీలో 5, జాగ్రఫీలో 35 సాధించిన విద్యార్ధికి రావడం విచిత్రంగా ఉందని అంటున్నారు.
దీనిపై స్పందించిన విద్యారంగ నిపుణుడు డా. కిరీట్ జోషీ మార్కుల కూడికలో తప్పు కావొచ్చని లేకపోతే 10 సంఖ్యను పొరబాటుగా 100గా మార్చివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై టీచర్లు, విద్యానిపుణులు సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.