ఆ ఎర్రని మందారం.. రాలిపోయింది!
ఈమె పేరు శృతి.. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన యువతి. బీటెక్ పూర్తి చేసిన శృతి ప్రస్తుతం నల్ల మల్లారెడ్డి కాలేజీలో ఎంటెక్ చదువుతోంది. తండ్రి పేరు సుదర్శన్. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ప్రభుత్వ టీచర్. ఆయనకు నలుగురు కూతుళ్లు. వాళ్లలో శృతి రెండో అమ్మాయి. సుదర్శన్ విరసంలో సభ్యుడు. శృతి పుట్టినప్పుడు ఆయన రాసుకున్న కవిత ఇది....
మా ఇంటి చెట్టులో ఒక కొమ్మకూ విరబూసే ఎర్రని మందారం
ఆగస్టు 22నాడు మసక చీకట్లు కమ్మేటీ కాలంబులో
వాన చినుకన్న లేకుండా భూగోళం వేడేక్కిపోతున్న కాలంబులో
లోకానికే అన్నదాత అయిన రైతు ప్రాణాలు దీసుకునే కాలంబులో
పోరుకే ప్రయోగశాలయైన పోరు ఖిల్లన్న పేరున్న జిల్లాలోనా
60 ఏండ్ల పోరులోన అసువులు బాసి సాధించుకున్న తెలంగాణలోన
ఆదివాసులే జనతన సర్కారయి స్వావలంబన జేసేటీ కాలంబులో
దండకారణ్యమే ఎర్రసైన్యమయ్యి గ్రీనుహంటును ఎదిరించే కాలంబులో
శ్రామిక రాజ్యం స్థాపనకై శ్రవజీవులేకమై తీరాలని