Feedback Infra Limited
-
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
మహా నగరి... ఐటీఐఆర్‌పై గురి!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)గా ఆవిష్కరించే ప్రక్రియ జోరందుకుంది. నగర శివారులో సుమారు 202 చ.కి.మీ. పరిధిలో ‘ఐటీఐఆర్ మాస్టర్ ప్లాన్’ను రూపొందించేందుకు 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా ఫీడ్ బ్యాక్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్వీ అసోసియేట్స్, లీ అసోసియేట్స్, ఎ.ఇ. కాన్ లిమిటెడ్, బీడీఎస్, యాట్కిన్స్ సంస్థలు ఉన్నాయి. ‘ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్’ రూపకల్పనకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు ఇటీవల హెచ్ఎండీఏ టెండర్లు పిలవగా.. 6 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నారు. ఇందులో అర్హత సాధించిన సంస్థల సమక్షంలోనే ఫైనాన్షియల్ బిడ్స్ తెరవాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఎవరు తక్కువ మొత్తానికి (ఎల్-1) కోట్ చేస్తే... ఆ సంస్థకు అవకాశం ఉంటుంది. అర్హత గల ఎల్-1, ఎల్-2 సంస్థల జాబితాను హెచ్ఎండీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి...ఆయన అనుమతించాక సచివాలయంలోని ృన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఐటీసీ) విభాగానికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. అటునుంచి అనుమతి వచ్చాకఎల్-1 సంస్థను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాక 6 నెలల వ్యవధిలో ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను హెచ్ఎండీఏకు అందజేయాల్సి ఉంటుందని అంటున్నారు. సమగ్ర అధ్యయనం... మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎంపికైన సంస్థ హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమమైన ఐటీ సంస్థలు ఏవి? వాటిని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఏమేరకు అవకాశం ఉంది? ఏయే సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చనే ది కన్సల్టెన్సీ సంస్థ సూచించవచ్చు. కొత్తగా ఏయే సంస్థలు వచ్చే అవకాశం ఉంది? వాటికి ఇక్కడ ఎంత భూమి అందుబాటులో ఉంది? ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించేందుకు గల అవకాశాలు? వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నగరం చుట్టూ 202 చ.కి.మీ. పరిధిలో ప్రస్తుతం ఏయే మాస్టర్ ప్లాన్లు అమలులో ఉన్నాయి? ప్రభుత్వ భూమి ఎంత ఉంది? అనే విషయమై ఆసంస్థ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించాల్సి ఉంది. ఐటీ విప్లవం ఐటీఐఆర్ తొలి దశ (2018)లో రూ.800 కోట్లు రాబట్టుకోవడం ద్వారా హైదరాబాద్‌లో ఐటీ విప్లవాన్ని తేవాలని సీఎం కేసీఆర్ ‘విశ్వ’ ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్లో ప్రస్తుతం అమల్లో ఉన్న హుడా, హడా, సీడీఏ, తదితర మాస్టర్ప్లాన్లకు అవసరమైన మార్పులు చేసి, ఐటీఐఆర్‌కు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తరువాత దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు తీసుకొని వాటిని కమిటీ ముందు పెట్టి... అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి అంతిమంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా అంటే 2016 నాటికి దీన్ని అమలులోకితేవాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు.