నిధులున్నా.. పనులు సున్నా!
ఆగిన ప్రతిపాదనలు ఏఈ లేక
కుంటుపడుతున్న అభివృద్ధి కీలకపోస్టు ఖాళీ
ఉన్నతాధికారులకు నివేదించినా.. స్పందన కరువు
పరకాల : నగర పంచాయతీలో కీలకపోస్టు ఖాళీ అయ్యింది. సంబంధిత అధికారి లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయాలని నివేదిక అందించిన ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ప్రధాన ఆటంకంగా మారింది. నగర పంచాయతీలో కమిషనర్ తరువాత కీలకపోస్టు ఏఈ. నగర పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఏఈగా రవీంద్రనాథ్ విధులు నిర్వహించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తునే భూపాలపల్లి నగర పంచాయతీకి ఇన్చార్జిగా వ్యవహారించారు. ఈక్రమంలో రవీంద్రనాథ్ను భూపాలపల్లి ఏఈగానే పూర్తి బాధ్యతలను అప్పగించారు. దీతో మే 30వ తేదీన పరకాల నుంచి ఆయన వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఏఈ పోస్టు ఖాళీగా మారింది. కనీసం ఇన్చార్జిని నియమించకపోవడంతో ఆ బాధ్యతలను కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు.
ప్రతిపాదనలకు ఆటంకం..
నగర పంచాయతీ అభివృద్ధి కోసం సీఎం స్పెషల్ ఫండ్ మంజూరు చేశారు. కూరగాయల మార్కెట్ ఆధునీకరణ కోసం రూ.1కోటి, అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి ఆర్టీసీ డిపో వరకు, బస్టాండ్ నుంచి బుడిగజంగాల కాలనీలోని నగర పంచాయతీ కార్యాలయం వరకు సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.60కోట్లు, నూతన నగర పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.1.50కోట్లు, స్లాటర్ హౌజ్(గొర్రె, మేల వధశాల) నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులు విడుదలయ్యాయి. వీటితోపాటుగా 14వ ఫైనాన్స్ రూ. 1కోటి నిధులు విడుదలయ్యూరుు. ఈ పనులకు ప్రతిపాదనలు చేసే బాధ్యత ఏఈపైనే ఉంటుంది. కాని ఏఈ లేక పోవడంతో నిధులున్న ప్రతిపాదనలు చేసే నాథుడు లేక ఆటంకం కలుగుతోంది. కొత్త ఏఈ లేక పోవడంతో ఎక్కడిపనులు అక్కడే ఆగుతున్నాయి. నిధులు ఉన్నప్పటికీ పనుల బాధ్యతను చూసే అధికారి లేక అభివృద్ధి ముందుకు సాగడం లేదు. వీటితోపాటుగా స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మాణం చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ముఖ్యంగా మిషన్ భగీరథ కింద ప్రారంభించిన రూపాయికే నల్లా కనెక్షన్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేక ఇబ్బందులు పడుతుండగా ఏఈ పోస్టుఖాళీగా మారడంతో కమిషనర్‌పై అదనపు బాధ్యత నిర్వర్తించాల్సి వస్తోంది.