చేపల దొంగలు అరెస్ట్
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: అర్థరాత్రి వేళ చెరువులో గుట్టుచప్పుడు కాకుండా చేపలు పట్టి టాటా ఏస్ వాహనంలో మార్కెట్‌కు తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మన్మదకుమార్ కథనం మేరకు.. మిర్యాలగూడ మండలంలోని యాదగిరిపల్లికి చెందిన నాగరాజు, నాగబోయిన నాగరాజు, ఎండీ జానీ, అన్నపురి సతీష్, బంటు వెంకటరమణ, చిత్తూరి కృష్ణ, శ్రీరామోజు శివ, బెరైడ్డి అశోక్‌కుమార్‌లు స్నేహితులు. వీరంతా ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా చెరువుల్లో చేపల దొంగతనానికి పాల్పడుతున్నా రు. ఈ క్రమంలో వారు బుధవారం అర్థరాత్రి టాటా ఏస్ వాహనంలో పోచంపల్లి చెరువు వద్దకు చేరుకున్నా రు. గుట్టు చప్పుడు కాకుండా చేపలు పట్టుకొని వాటిని వాహనంలో మార్కెట్‌కు తరలిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. అనుమానం వచ్చి వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో చేపలు ఉన్నాయి. నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులంతా యువకులే..
నిందితులంతా 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్నారు. మొ త్తం 8 మంది రాగా ప్రధాన నిందితుడు నాగరాజు పరారయ్యారు. వీరిలో ఆటో, లారీ డ్రైవర్లు, ఇద్దరు విద్యా ర్థులు కూడా ఉండటం గమనార్హం.
కఠినంగా శిక్షించాలి
నిందితులను కఠినంగా శిక్షించాలని మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షుడు చెక్క రమేష్, భిక్షపతి, జంగయ్యలు డిమాండ్ చేశారు. గురువారం పోలీసుస్టేషన్లో ఫిర్యా దు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పోచంపల్లి, రేవనపల్లి, ముక్తాపూర్, పెద్దరావులపల్లి, గౌస్‌కొండ చెరువుల్లో చేపల దొంగతనాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెరువుల వద్ద కపలా ఉన్న వ్యక్తులను మారణ ఆయుధాలతో బెదిరించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.