Five golds
-
శ్రీహరి నటరాజ్‌కు స్వర్ణం
తాష్కెంట్: ఉజ్బెకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్ల పతకాల వేట కొనసాగుతోంది. గురువారం భారత్‌కు ఎనిమిది పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉంది. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 20 ఏళ్ల తమిళనాడు స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ స్వర్ణం గెలిచాడు. అతను 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే శ్రీహరి 0.22 సెకన్లతో టోక్యో ఒలింపిక్స్ ‘ఎ’ గ్రేడ్ అర్హత ప్రమాణాన్ని (53.85 సెకన్లు) కోల్పోయాడు. 2019 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో శ్రీహరి టోక్యో ఒలింపిక్స్ గ్రేడ్ ‘బి’ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. గ్రేడ్ ‘ఎ’ ప్రమాణం ఉంటే నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఒకవేళ గ్రేడ్ ‘ఎ’ కోటాలో ఖాళీలు మిగిలితే గ్రేడ్ ‘బి’ సమయం నమోదు చేసిన వారికి అవకాశం లభిస్తుంది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మానా పటేల్ (1ని:04.47 సెకన్లు) బంగారు పతకాన్ని గెల్చుకుంది. సువన భాస్కర్ ఖాతాలో రజతం చేరింది. పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో సజన్ ప్రకాశ్ (3ని:56.03 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఈ టోర్నీలోని సజన్‌కిది మూడో స్వర్ణం కావడం విశేషం. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో శివాని కటారియా స్వర్ణం పొందగా... మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చాహత్ అరోరా బంగారు పతకాన్ని ౖకైవసం చేసుకుంది. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో లిఖిత్, ధనుశ్ వరుసగా రజతం, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. -
‘పసిడి’ పంట పండించారు
♦ చివరి రోజు ఐదు స్వర్ణాలు నెగ్గిన భారత అథ్లెట్స్ ♦ 29 పతకాలతో ఆసియా అథ్లెటిక్స్‌లో అగ్రస్థానం భువనేశ్వర్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆదివారంతో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ 12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 20 పతకాలతో చైనా (8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) రెండో స్థానంతో సంతృప్తి పడింది. 1985, 1989 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధికంగా 22 పతకాలు గెలిచింది. ఆఖరి రోజు భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ (5,942 పాయింట్లు)... 10 వేల మీటర్ల రేసులో లక్ష్మణన్ (29ని:55.87 సెకన్లు)... జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (85.23 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు. పురుషుల, మహిళల 4గీ400 మీటర్లలో భారత రిలే జట్లు స్వర్ణాలు నెగ్గాయి. భారత్‌కే చెందిన పూర్ణిమ (హెప్టాథ్లాన్), జాన్సన్ (పురుషుల 800 మీటర్లు్ల), దవిందర్ సింగ్ (జావెలిన్ త్రో) కాంస్య పతకాలను కైవసం చేసుకోగా... గోపీ (10 వేల మీటర్లు్ల) రజతం నెగ్గాడు.అర్చనకు నిరాశ: మహిళల 800 మీటర్ల రేసులో భారత అథ్లెట్ అర్చన (2ని:05.00 సెకన్లు) విజేతగా నిలిచింది. అయితే తనను వెనక్కినెట్టి అర్చన ముందుకెళ్లిందని శ్రీలంక అథ్లెట్ నిమాలి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం నిమాలి ఆరోపణల్లో నిజం ఉందని నిర్వాహకులు తేల్చి అర్చనపై వేటు వేసి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.