రాష్ట్రస్థాయి ఫ్లోర్బాల్ విజేతలకు అభినందన
అమరావతి: రాష్ట్ర స్థాయి ప్లోర్బాల్ జట్టుకు ఎంపికయిన శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ విద్యార్థులను మంగళవారం పాఠశాల కరస్పాండెంట్ మల్లెల శ్రీనాధచౌదరి, పాలక వర్గసభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈసందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు అనూరాధ మాట్లాడుతూ ఈనెల 26వతేదీన కర్నూలు జరిగిన పోటీలలో అండర్ 17 ప్లోర్బాల్ బాలురవిభాగంలో చుండూరి వరప్రసాద్, బాలికల విభాగంలో చిలకా మనీషాలు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. జనవరి మొదటి వారంలో ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే డిసెంబరు 3వతేదీన అమరావతి శ్రీరామకృష్ణహిందూ హైస్కూల్ గ్రౌండ్లో రాష్ట్రస్థాయి టెన్నిస్వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జట్టులో స్థానం సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా పాఠశాల పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేసి మరిన్ని విజయాలు సాదించాలన్నారు. సందర్భంగా పాలకవర్గ ఉపాధ్యక్షుడు పారేపల్లి వెంకటసత్యనారాయణరావు, ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, ప్రసాద్, గాంధీలతోపాటుగా పలువురు ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు.