సన్ టీవీ లాభం 19 శాతం అప్
4 రోజుల్లో 23 శాతం ఎగసిన షేర్
న్యూఢిల్లీ : సన్ టీవీ నెట్వర్క్ సంస్థ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 19 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.197 కోట్లకు ఎగసిందని సంస్థ తెలియజేసింది. ఆదాయం రూ.634 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.691కు వృద్ధి చెందింది. కాగా ఈ షేర్ నాలుగు రోజుల్లో 23 శాతం ఎగసింది. ఈ నెల 28న రూ.274గా ఉన్న ఈ షేర్ శుక్రవారం నాటికిరూ.337కు ఎగసింది. సన్ గ్రూప్‌కు చెందిన రెడ్ ఎఫ్ఎంను మూడో దశ ఎఫ్ఎం స్టేషన్ల వేలంలో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించడంతో గత మూడు రోజుల్లో(గురువారం వరకూ) ఈ షేర్ 14 శాతం పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే షేర్ ధర 9 శాతం పెరిగింది.