Food and Safety officers
-
ప్రజారోగ్యం పణంగా పెట్టి..
సాక్షి, నెల్లూరు: ప్రజారోగ్యం పణంగా పెట్టి.. యథేచ్ఛగా కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న చికెన్ సెంటర్పై ఆదివారం ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని కోట మండలంలో టీడీపీ నేత జలీల్బాషాకు చెందిన చికెన్ సెంటర్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. 285 కిలోల కుళ్ళిన మాంసాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ మాంసాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార నియంత్రణ మండలి అధికారులు హెచ్చరించారు. -
స్వీట్ షాపుల్లో తనిఖీలు
తెనాలి (గుంటూరు) : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని స్వీట్ షాపుల్లో ఆహార నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. రీజినల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచందర్రావు నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం సోదాలు చేపట్టింది. పలు దుకాణాల్లో మిఠాయిల శాంపిల్స్ సేకరించింది. దుకాణాల్లో నాణ్యమైన పదార్థాలతో తయారుచేసిన వంటకాలను విక్రయిస్తున్నారా లేక కాలం చెల్లిన పదార్థాలతో తయారుచేసినవి విక్రయానికి ఉంచుతున్నారా అనేవి పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.