వర్ధన్నపేట మాజీ సమితి అధ్యక్షుడు జగన్నాథరావు మృతి
న్యూశాయంపేట/ వర్ధన్నపేట : వర్ధన్నపేట మాజీ సమితి అధ్యక్షుడు ఎల్లంకి జగన్నాథరావు (91) బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. వర్థన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో జన్మించిన ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసుకొని వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేశారు. కొంతకాలం తర్వాత రాజీనామా చేసి కాంట్రాక్టర్‌గా పనిచేశారు. అనంతరం ల్యాబర్తి గ్రామ స ర్పంచ్‌గా సుదీర్ఘకాలం పనిచేసి గ్రామాభివృద్ధికి కృషిచేశా రు. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పాల కమండలి సభ్యుడిగా కొనసాగారు. కాగా, జగన్నాధరావు 1981–86 వరకు వర్ధన్నపేట పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేసి ఉత్తమ సమితి అధ్యక్షుడిగా అవార్డు అందుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరారు. కొన్నాళ్లకు తల్లితెలంగాణ పార్టీలోనూ పనిచేశా రు. బియ్యాల జనార్దన్‌రావు మోమోరియల్ ట్రస్ట్ చైర్మన్‌గా, జనార్దన్‌రావు స్మారకంగా అనేక కార్యక్రమాలు ని ర్వహించారు. హన్మకొండలోని భారతి విద్యాభవన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మృతిపై భారతి విద్యాభవన్ కరస్పాండెంట్ టి.బుచ్చిబాబు, సెక్రటరీ శ్రీదేవి సంతాపం తెలిపారు.
జగన్నాథరావు సేవలు శ్లాఘనీయం : ఎర్రబెల్లి
వరంగల్ : వర్ధన్నపేట మాజీ సమితి అధ్యక్షుడు ఎల్లంకి జగన్నాథరావు సేవలు శ్లాఘనీయమని పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపా రు. బుధవారం ఎల్లంకి జగన్నాథరావు అకాల మరణంపై ఆయన కుటుంబ సభ్యులకు దయాకర్‌రావు ప్రగాఢ సం తాపాన్ని వ్యక్తం చేశారు. సమితి అధ్యక్షుడిగా జగన్నాథరావు వర్ధన్నపేటకు చేసిన సేవలు మరవలేమన్నారు.