పర్నిచర్ గోడౌన్లో అగ్నిప్రమాదం; భారీగా ఆస్తినష్టం
కడప: జిల్లాలోని హబీబుల్లా వీధిలోని ఓ పర్నిచర్ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో పర్నిచర్ కాలిపోవడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గోడౌన్ నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.