gaddam sai
-
మార్గదర్శి.. మహాత్మా పూలే: జోగు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావుపూలే దేశానికి మార్గదర్శనం చేసిన మహనీయుడని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డం సాయికిరణ్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ రవీంద్రభారతిలో పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోగు రామన్న మాట్లాడుతూ సమాజంలో విలువలతో బతకాలన్నా, సంస్కారంతో ఉండాలన్నా విద్యతోనే సాధ్యపడుతుందన్నారు. అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మరొక పూలే అని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.33 వేల కోట్లను కేటాయించిందన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు వచ్చే జయంతికల్లా పూలే విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పుతామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు ఎక్కువ సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా ఉంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూలే బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన యోధుడని, అందరికీ సమానహక్కులు ఉండాలని ఆకాంక్షించిన మహనీయుడని అన్నారు. ఒకప్పుడు దొరలకు, భూస్వాములకు మాత్రమే భూములెక్కువగా ఉండేవని, ప్రస్తుతం గ్రామాల్లోని రికార్డుల ప్రకారం అధికశాతం భూములు బీసీలకే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశ పెడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీలకు చట్టసభల్లో వాటా తెచ్చే విధంగా పోరాడితేనే పూలేకు ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితారాజేంద్ర, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ సభకు ముందు చేనేత కార్మికుల అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో శనివారం టీడీపీ మినీ మహానాడు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘనాథ రెడ్డి, పరిటాల సునీతా, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. అయితే ఈ సభను అక్కడి చేనేత కార్మికులు అడ్డుకుంటారనే కారణంగా ముందస్తుగా 200 మంది చేనేత కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, టీడీపీ నేత గడ్డం సాయి వేధింపులు అరికట్టాలంటూ గత మూడు రోజులుగా చేనేత కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఇదెక్కడి న్యాయం?
►రుణవిముక్తి చేయలేనన్న ఎమ్మెల్యే సూరి ►ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు ►నోర్మూయ్ అంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూరి ధర్మవరం అర్బన్ : చలిచీమలు ఏకమయ్యాయి... బానిస సంకెళ్ళ నుండి విముక్తి అయ్యేందుకు వేలాదిమంది కార్మికులు ఒక్కటౌతున్నారు. తమ బతుకులు నాశనమయ్యాయని, రుణ విముక్తి కల్పించాలని ఏకంగా స్థానిక ఎమ్మెల్యేను కూడా నిలదీసే స్థితికి చేరుకున్నారు. వివరాలలోకి వెళితే... ధర్మవరం పట్టణంలోని చేనేత యజమాని గడ్డం సాయి అరాచకాలను ఎండగట్టాలని, వారి నుండి తమకు విముక్తి ప్రసాదించాలని కోరుతూ... సుమారు 250 చేనేత కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. బుధవారం రాత్రి ఎమ్మెల్యే సూర్యనారాయణ ఇంటి వద్ద ధర్నా చేసిన కార్మికులు గురువారం కూడా తమ ఆందోళనలను కొనసాగించారు. ఉదయం 10గంటలకే ఆర్డిఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు, ఆర్డిఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ రక్షణ కల్పించాలని, బానిస సంకెళ్ళ నుండి విముక్తి ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ విషయంపై ఆర్డిఓ నాగరాజు సరైన వివరణ ఇవ్వకపోవడంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఆర్డిఓ కారును అడ్డుకున్నారు. దీంతో దిగివచ్చిన ఆర్డిఓ మీకు జరిగిన అన్యాయంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరారు. వీటిపై తమకు జరిగిన అన్యాయాలని లేఖలో రాసి ఆర్డిఓ కార్యాలయ అధికారికి అందజేశారు. కార్మికుల ప్రాణాలను దోచుకు తింటున్న గడ్డం సాయిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు అక్కడి నుండి తిరిగి వెళ్ళే సమయంలో అదే మార్గంలో ఎమ్మెల్యే రావడంతో ఆయన కారును అడ్డుకున్నారు. అయినా కూడా కారు డ్రైవర్ నిలపకుండా వెళ్ళడంతో కార్మికులు ఎమ్మెల్యే డౌన్... డౌన్... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారును వెంబడించారు. అక్కడి నుండి ఎమ్మెల్యే మినీ మహానాడు కార్యక్రమాలను పరిశీలించేందుకు రావడంతో అక్కడికి చేరుకున్న కార్మికులు గడ్డం సాయి ఆగడాలను అరికట్టాలని తమను బంధ విముక్తులను చేయాలని ప్రాధేయపడ్డారు. ఈ విషయంపై యజమానితో చర్చించి న్యాయం చేస్తానని చెప్పినా ఆందోళనకారులు ఏ మాత్రం వినలేదు. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే సరాసరి గడ్డంసాయి ఇంటి వద్దకే వెళ్ళారు. అక్కడికి చేనేత కార్మికులు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. రూరల్ ఎస్ఐ సుబ్బరాయుడు, కార్మికులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నారు. గడ్డం సాయితో చర్చించిన అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఆందోళనకారులతో మాట్లాడుతూ... గడ్డం సాయి వద్ద పనిచేస్తున్న కార్మికులకు రుణమాఫీ చేయలేమన్నారు. కార్మికులకు అవసరమైతే యజమానికి బాకీ ఉన్న వడ్డీను తగ్గిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అందించేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొనడంతో కార్మికులు ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇదే విషయంపై మహిళా కార్మికులు ఎమ్మెల్యేతో గొడవకు దిగారు. మాదవ నాగరాజు నిర్వహిస్తున్న మగ్గాలకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎలా చేస్తామని ప్రశ్నించారు. వారందరూ రుణ విముక్తికి అర్హులైనప్పుడు మేమేందుకు అవమని ప్రశ్నించారు. ఈ విషయంపై తడబడిన ఎమ్మెల్యే గతంలో ఎన్నికలప్పుడు తనకు సహకరించలేదని పేర్కొనడం కొసమెరుపు. మాదవ నాగరాజు విషయంలో జరిగినట్లుగానే మాకు కూడా విముక్తి కల్పించి తీరాలన్నారు. ఈ వాదులాట చోటు చేసుకుంటున్న తరుణంలో మహిళలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయ్... నోర్మూసుకుని కూర్చో..!! రౌడీయిజం చేస్తున్నారా..? అంటూ మాట్లాడడం విశేషం. -
విముక్తి కల్పించండి
గడ్డం సాయి ఆగడాలపై ధ్వజమెత్తిన చేనేత కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగిన వైనం విముక్తి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యం ధర్మవరం అర్బన్ : బానిస సంకెళ్ల నుండి తమకు పూర్తిగా విముక్తి కల్పించాలని, గడ్డం సాయి నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని 250 కుటుంబాలు రోడ్డెక్కాయి. రాత్రి 8గంటల సమయంలో ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇంటినే ముట్టడించాయి.ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమను నడుపుతున్న గడ్డం సాయి తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని వారి ఆగడాలకు ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు రోజుల క్రితం చేనేత కార్మికులకు కల్పించినట్లుగానే మాకు కూడా విముక్తి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటల పాటు ఎమ్మెల్యే ఇంటిని చుట్టు ముట్టినా కూడా ఒక్క అధికారి కానీ, పోలీసులు కానీ వారిని పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేశారు. స్పందించిన ఆర్డీవో తప్పకుండా రుణ విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గడ్డం సాయి చేస్తున్న అరాచకాలపై కార్మికులు చెప్పిన మాటలు ఇవి. భర్త పారిపోయాడని కొడుకును కట్టేసుకున్నారు సాయి వేధింపులకు తాళలేక నా భర్త పారిపోయాడు. అయినా కూడా అప్పు తీర్చాలని ఇష్టం వచ్చినట్లు నన్ను కొట్టారు. పదవ తరగతి చదివే నా కుమారుడిని ఏకంగా కట్టేశారు. కాళ్లావేళ్లా పడినా కూడా కనికరించలేదు. ఉదయం 5 గంటలకే లేవాలి, లేదంటే కట్టెలతో కూడా కొడతారు. పదవ తరగతి చదువుతున్న నా కుమారుడితో ఇప్పుడు మగ్గం వేయిస్తున్నారు. - అంజనాదేవి, చేనేత కార్మికురాలు అల్లుడికి బాగలేకపోతే రూపాయి ఇవ్వలేదు నా అల్లుడు కరెంట్ షాక్‌కు గురై ప్రమాదానికి లోనైతే వైద్యం చేయించుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గడ్డం సాయి కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించలేదు. చివరికి రూ.500 అడిగినా కూడా మీకేమన్న బాకీ ఉన్నామా అంటూ మాపై దాడి చేశారు. - వెంకట నారాయణమ్మ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాను గడ్డం సాయి రాక్షసుడి లా ప్రవర్తిస్తారు. ఇష్టం వచ్చినట్లు మాపై గు మాస్తాలతో దాడులు చేయిస్తారు. కాళ్లు ప ట్టుకున్నా కనికరించరు. ఇదెక్కడి న్యాయం మేము బానిసలు అనుకున్నారా? ఆయన వేధింపులు తాళలేక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినా అయినా కూడా వదల్లేదు. మా గోడు పట్టించుకునేవారే లేరు. - పెద్దన్న, చేనేత కార్మికుడు